ఆరు నూరైనా నియోజక వర్గాలను పెంచుకుంటా - MicTv.in - Telugu News
mictv telugu

ఆరు నూరైనా నియోజక వర్గాలను పెంచుకుంటా

October 26, 2017

2019 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగడం ఖాయమని కేసీఆర్ తన టీమ్‌కు  భరోసానిచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, పార్టీ కోసం పనిచేసే వారికి న్యాయంగా టికెట్లు వస్తాయని కేసీఆర్  ధీమా వ్యక్తం చేశారు.

‘కేంద్రంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న. ఈ అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుకోలేమా?’ అని శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ అన్నారు. 119గా ఉన్న నియోజకవర్గాల సంఖ్యను 153కు చేర్చడం, ఆరు నూరైనా జరుగుతుందని జరుగుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఈ ప్రకటన టీఆర్‌ఎస్ పార్టీలోని చాలామందికి మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపినట్టు అయ్యింది.