ప్రతిపక్షాల్లో సదువుకున్నోడు లేడు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతిపక్షాల్లో సదువుకున్నోడు లేడు

October 26, 2017

గురువారం జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో తన అనుచరగణానికి ధైర్యాన్ని నింపే పనిని కేసీఆర్ తీసుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దగ్గరకు తీసుకపోవడమే కర్తవ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పని చేయాలన్నారు. ప్రతిపక్షాలు కనీసం తమను విమర్శించడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

రోజూ తలా తోకలేని మాటలు మాట్లాడుతూ ప్రజల ముందు ప్రతిపక్షాలు, తమను తాము దిగజార్చుకుంటున్నాయని కేసీఆర్ అన్నారు. అసలు ప్రతిపక్షాల్లో సదువుకున్న నాయకుడే లేకపోవడం మనకు కలిసొచ్చే అంశమని తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం,  ఎవరూ ప్రయత్నాలు చేయద్దొని, తాము ప్రజలకు చేస్తున్న సేవను బట్టి, ఎవరికి టికెట్లు ఇవ్వాల్లో ఇవ్వద్దో నిర్ణయిస్తానని అన్నారు. టికెట్ల కోసం పైరవీలు చేయడం మానుకొని, ప్రజలకు సేవ చేయడంలో పనితనం చూపాలని తెలిపారు. ప్రజల మన్నన పొందినోళ్లే, కేసీఆర్ మన్నన పొందుతారని కేసీఆర్ తేల్చేశారు.