కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు లెఫ్ట్ దూరం.. కారత్ తేల్చేశాడు! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు లెఫ్ట్ దూరం.. కారత్ తేల్చేశాడు!

March 23, 2018

జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు యత్నిస్తున్న కేసీఆర్ కామ్రేడ్ల నుంచి ప్రతికూల స్పందన వస్తోంది. ఈ మూడో కూటమితో సాధించేదేమీ ఉండదని సీపీఐ, సీఎంఎం స్థానిక నేతలు చాడా, తమ్మినేతి తదితరులు ఇప్పటికే స్పష్టం చేయగా సీపీఎం జాతీయ స్థాయి నాయకుడు ప్రకాశ్ కారత్ కూడా తాజాగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి నిర్మించడం అంత సులభం కాదని, అలాంటివి విఫలమవుతాయని అన్నారు.‘ప్రాంతీయ పార్టీల మధ్య విధానాలు, ప్రాయోజనాల్లో చాలా వైరుధ్యాలు ఉంటాయి. అవి సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. జాతీయ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవు. అవన్నీ ఏకతాటిపైకి రావడం కష్టం. బీజేపీ అంతు తేల్చాలంటే ఇతర పార్టీల ఓట్లు చీలిపోకుండా చూసుకోవాలి’ అని సూచించారు. డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ వంటి పార్టీలు ఇప్పటికీ కాంగ్రెస్‌ను వీడవని, టీఆర్ఎస్, టీడీపీ, బీజేడీ వంటికి కాంగ్రెస్‌తో జట్టుకట్టవని విశ్లేషించారు. అవి ఎన్నికల వ్యూహాలు, స్వప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటాయనన్నారు.