తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగుల్లో ఉత్కంఠ రేపారు. ‘రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీ చూడండి’ అని చెప్పారు. అసెంబ్లీలో తాను ప్రకటన చేయబోతున్నానని, తెలంగాణను ఏ ఆవిష్కారమైందో తెలుస్తుందన్నారు.
ఈ రోజు ఆయన వనపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగాల నోటిఫికేషన్, నిరుద్యోగ భృతిపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. 2018 ఎన్నికల నాటి నిరుద్యోగ భృతి హామీని ఇప్పటికీ అమలు చేయకపోవడంతో విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.