మరికొన్ని గంటల్లో హుజుర్‌నగర్‌కు కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మరికొన్ని గంటల్లో హుజుర్‌నగర్‌కు కేసీఆర్

October 17, 2019

Kcr to visit hujur nagar today

హుజుర్‌నగర్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్‌నగర్‌లో పర్యటించనున్నారు. మరికొన్ని గంటల్లో హుజుర్‌నగర్ బహిరంగ సభకు కేసీఆర్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1గంటకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హుజుర్‌నగర్‌కు బయలుదేరుతారు. 

మధ్యాహ్నం 2-3 గంటల మధ్య హుజుర్‌నగర్ చేరుకునే అవకాశం ఉంది. అరగంట సేపు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 4 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా నల్గొండ, సూర్యాపేట ఎస్పీల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకానున్నారు. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డి సభాస్థలికి చేరుకుని ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు.