1996లో శ్రీరాంసాగర్ కట్టమీదకు వచ్చి చూస్తే పరిస్థితి దీనంగా కనిపించింది. పరిస్థితులు బాగుపడాలంటే స్వరాష్ట్ర సాధనే మార్గమని ఆనాడే చెప్పాను. రాష్ట్రాన్ని సాధించి తీరుతానని ఎస్సారెస్పీ సాక్షిగా అప్పుడే శపథం చేశాను. ఇన్నాళ్ల తర్వాత రాష్ట్రాన్ని సాధించి ఎస్సారెస్పీకి పునరుజ్జీవనం చేస్తున్నందుకు,ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నా జన్మదన్యమైంది.
2001 లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత జలసాధన ఉద్యమం చేపట్టినం.నాటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నీ మోసపూరిత ప్రాజెక్టులే.ఆంధ్రవాళ్లు మనకు నీళ్లచ్చే ప్రాజెక్టులు ఒక్కటి కట్టలేదు.కాల్వలు తవ్వి కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయారు కానీ పనులు చేయలేదన్నారు.పరిస్థితి చూశాక. తెలంగాణ ఉద్యమం చేస్తానని.. తెలంగాణ సాధిస్తానని.. గట్టి నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ చెప్పారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రూపురేఖలు మార్చాలని…ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ వైష్ణవాలయం లాగా ఉంటే.. తెలంగాణకు నీళ్లిచ్చే శ్రీరాంసాగర్ శిథిల శివాలయంలా మారిందన్నారు.ఇప్పుడు ఆ శిథిలావస్ధ శ్రీరాం సాగర్ ప్రాజెక్టును పునరుజ్జీవనం పోస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు కేసీఆర్.
శ్రీరాంసాగర్ ద్వారా నిజామాబాద్, నిర్మల్, సూర్యాపేట, నల్గోండ దాకా నీరు చేరుతుంది. బస్వాపూర్, గందమల్ల దాకా నీళ్లు మళ్లిస్తాం. పోరంబోకు భూములతో అద్భుతమైన పర్యావరణ క్షేత్రంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును తీర్చిదిద్దుతాం. సినిమా వాళ్ల షూటింగ్ స్పాట్ గా చేస్తం.కాంగ్రెస్ పార్టీ నాయకులు నీటి ప్రాజెక్టులకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ నేతల మీద ఎక్కడికక్కడ తిరగబడాలి. సాగునీటి ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీయాలి’ అని పిలుపునిచ్చారు కేసీఆర్. వచ్చే సంవత్సరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నీళ్లతో నింపుతామన్నారు. కరంట్ కోసం 35 ఏండ్లు మనల్ని ఏడిపిచ్చినారు..ఇప్పుడు కరంట్ కష్టాలు లేవు,వచ్చే యాసంగినుంచి 24 గంటలు 3 ఫేజ్ కరంటు ఇస్తం అని చెప్పారు కేసీఆర్.
CM Sri KCR addressing the gathering after laying foundation stone for Sriramsagar Project Revival & Restoration at Pochampad Village
Posted by KCR on Thursday, 10 August 2017