వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాక్షిక మేనిఫెస్టో ప్రకటించారు. రైతులు, మహిళలు లక్ష్యంగా పలు ఆకర్షణీయ హామీలు ప్రకటించారు. వృద్ధాప్య పింఛను మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2016కు పెంచారు. రైతు బంధు పథకం మొత్తాన్ని రూ. 10 వేలకు పెంచారు.
57 ఏళ్లు పూర్తయిన వారికి ఆసరా పింఛన్లు(ప్రస్తుతం 65 దాటిన వారికే ఇస్తున్నారు)
పింఛను రూ. 1000 నుంచి రూ. 2,016కు పెంపు, వికలాంగులకు రూ. 3016
నిరుద్యోగ భృతి రూ. 3,016
రైతులకు రూ. లక్ష రుణమాఫీ
మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సబ్సిడీలు
రైతు బంధు పథకం కింద ఎకరాకు అందించే మొత్తం 8 వేల నుంచి 10 వేలకు పెంపు
రైతు సమన్వయ సమితులకు గౌరవ భృతి
డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం కొనసాగింపు
సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం
ఎస్సీ, ఎస్సీల అభివృద్ధికి 15 వేల కోట్లతో ప్రణాళికలు
ఆర్యవైశ్యుల అభివృద్ధి కార్పొరేషన్