అక్టోబర్ 3 నుంచి కేసీఆర్ సభాభేరీ   - MicTv.in - Telugu News
mictv telugu

అక్టోబర్ 3 నుంచి కేసీఆర్ సభాభేరీ  

September 25, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ సర్వసన్నద్ధమవుతోంది. ఎన్నికలకు తక్కువ వ్యవధి ఉండడంతో తన గొంతుకను బలంగా వినిపించేందుకు బహిరంగ సభలనే సమరాంగణాలుగా మార్చనుంది. అక్టోబర్ 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

TRS party to organise a huge public meeting in districts from Octorber 3rd chief KCR will speaks in all

ఈ సభలకు పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. అక్టోబర్ 3న నిజమాబాద్ జిల్లా సభను నిజమాబాద్ పట్టణంలో నిర్వహిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సభను నల్గొండలో 4న, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సభను 5న వనపర్తిలో నిర్వహిస్తారు. 7న వరంగల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా సభను, 8న ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సభను ఏర్పాటు చేస్తారు. వీటికి పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి నేతలకు, కార్యకర్తలకు ఆదేశాలు అందాయి.