కేంద్రమంత్రి పదవికి కేసీఆర్ మధ్యవర్తిత్వం...! - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రమంత్రి పదవికి కేసీఆర్ మధ్యవర్తిత్వం…!

July 27, 2017

వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక ఆయన స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావ్ రావాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారు.అందుకోసం ఆయన స్థాయిలో సంప్రదింపులు కూడా చేస్తున్నారని పక్కా సమాచారం.ఇందుకోసం తన ఢిల్లీ పర్యటనలో పావులు కదిపినట్టు తెలుస్తుంది.బిజెపి అధిష్టానానికి తన మనసులో మాటను వివరించినట్టు సమాచారం.

బిజెపి శిబిరంలోనూ,ఇటు టిఆర్ ఎస్ శ్రేణుల్లో ఈ విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈవిషయాన్ని వెంకయ్యనాయుడు దృష్టిలో కూడా కేసిఆర్ వేసినట్టు వినికిడి.అవసరమైతే చంద్రబాబు సహకారం కూడా నేరుగా ఆర్జించడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విద్యాసాగర్ రావును ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా చూడాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు లోలోపట అనుకుంటున్నాయి.ఇప్పటి వరకు కేసీఆర్ వేసిన ఏ స్కెచ్ కూడా ఫేయిల్ కాలేదని గులాబీ దండు ధీమాతో ఉంది. అయితే బిజెపి తరపున ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్రమంత్రి హోదాలో ఉన్నారు.ఖాళీ అయిన మంత్రి పదవి పోస్టును తెలంగాణ రాష్టానికి కట్టబెడతారా అనేది వేచి చూడాల్సిన ప్రశ్న.