నేడు కేసీఆర్ కు సర్జరీ - MicTv.in - Telugu News
mictv telugu

నేడు కేసీఆర్ కు సర్జరీ

September 4, 2017

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటికి సోమవారం ఢిల్లీలో శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యలో సీఎం శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై, సచివాలయం నిర్మాణం, రాష్ట్రానికి జీఎస్టీలో తగ్గింపు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం శస్త్రచికిత్స నేపథ్యంలో సెంటర్ ఫర్ సైట్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు  వైద్యపరీక్షలు చేశారు.