వీరిదీ ఓ చరిత్రే... - MicTv.in - Telugu News
mictv telugu

వీరిదీ ఓ చరిత్రే…

July 18, 2017

రాష్ట్రపతి ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఇద్దరు నాయకులు, ఓ జంట రికార్డు క్రియేట్ చేశారు.  అసెంబ్లీలో హాల్ 1లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు  చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఇందులో  12 గంటల వరకు  దాదాపు అన్ని పార్టీల సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకరిద్దరు గందరగోళంలోపడ్డారని ప్రచారం జరిగింది. మిగిలిన వారు అంతా ఒకే.

తొలి ఓటును వినియోగించుకున్న సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్. చిట్ట చివరి ఓటు వేసిన అభ్యర్థి కిషన్ రెడ్డి, ఉత్తమ్, పద్మావతి దంపతులు భార్యాభర్తలుగా ఉండి  వేశారు. ఇట్లా వేసిన తొలి జంట ఇదేనట. మన దేశంలోనే భార్యభర్తలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం  ఇదే తొలి సారి అని స్వయంగా పద్మావతి చెప్పారు.

ముందు అనుకున్నట్లుగానే  టిఆర్ఎస్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు సభ్యులు మాత్రం ఓటింగ్ దూరంగా ఉన్నారు.  ఇందులో టిఆర్ఎస్ సభ్యులు  మనోహర్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఓటింగ్ కు హాజరు కాలేదు.  ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ విదేశాల్లో ఉన్న కారణంగా ఓటింగ్ కు హాజరు కాలేదు. మిగిలిన 117 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం నుండి అక్కడే ఉన్న బిజెపి ఎల్పీ నేత కిషన్ రెడ్డి సాయంత్రం నాలుగున్నర తర్వాత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎందుకిలా అంటే చరిత్రలో తన పేరు ఉండాలని చెప్పారు. మధ్యాహ్నం తర్వాత వర్షం జోరుగా కురిసింది. అప్పటికే అన్ని పార్టీల సభ్యులు వెళ్లిపోయారు. ఒక్క కిషన్ రెడ్డి మాత్రం చరిత్రలో నిలబడేందుకోసం సాయంత్రం వరకు  అసెంబ్లీ వద్దే నిరీక్షించారు.