ఢిల్లీలో కంటి ఆపరేషన్ పూర్తి చేసుకుని ఇవాళ హైద్రాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో విజయవాడ వెళ్లనున్నున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని సీఎం మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నెల27 తేదీన విజయవాడ వెళ్లి కనక దుర్గమ్మకు ఆ మొక్కు చెల్లించనున్నారు. ఇప్పటికే దుర్గమ్మ అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు సమర్పించారు. తిరుమల వెంకన్నకు స్వర్ణ సాలిగ్రామహారం, స్వర్ణ కంఠాభరణాలు , కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.