ఓట్లను ఆకర్షించకపోతే వికర్షించాలా?.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఓట్లను ఆకర్షించకపోతే వికర్షించాలా?.. కేసీఆర్

March 27, 2018

ఎన్నికల్లో ఓట్ల కోసం ఆ పార్టీ ఇలా చేస్తోంది, అలా చేస్తోంది అని మన రాజకీయ నాయకులు.. ముఖ్యంగా విపక్షాల నేతలు విమర్శిస్తుంటారు. పాలకులు ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఓట్లను ఆకర్షించడం తప్పు అనే భావన కలిగిస్తుంటారు. కానీ ఓట్లను ఆకర్షించడం తప్పుకాదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మంగళవారం  స్పష్టం చేశారు. ఓట్లకు, ప్రజాస్వామ్యానికి అవినాభావ సంబంధం ఉందని, ప్రజాసంక్షేమం కోసం ఓట్లును ఆకర్షించాల్సిందే అని తేల్చి చెప్పారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో కేసీఆర్ మాట్లాడుతూ..‘ఓట్లను ఆకర్షించకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. మాది రాజకీయ పార్టీ. కనుక కచ్చితంగా ఓట్లను ఆకర్షిస్తుంది. అసలు మన పనే అది. దాంట్లో మళ్లీ శషభిషలు ఎందుకు? అదే రియల్ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ.. మనకు హిపోక్రసీ ఎందుకు? అన్నిపార్టీలకూ అదే పని కదా. ఎక్కువ శాతం మంది ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే.. ఓట్లను ఆకర్షించడం తప్పేమీ కదు. ఆకర్షించకపోతే వికర్షించాలా?’ అని అన్నారు.