కనిపిస్తే కాల్చివేత.. కేసీఆర్ హెచ్చరిక  - MicTv.in - Telugu News
mictv telugu

కనిపిస్తే కాల్చివేత.. కేసీఆర్ హెచ్చరిక 

March 24, 2020

 

gnvnhvgnh

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం తెలిసిందే. అయినా కొందరు ఇళ్ల నుంచి బయటికొస్తున్నారు. కొందరు అత్యవసర పనులపై వస్తుంటే కొందరు కేవలం షికార్ల కోసం వస్తున్నారు. పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. ప్రజలు సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని,వీరిలో ఒకరు కోలుకున్నారని, మరో 114 మంది కరోనా ఆ వ్యాధి లక్షణాతో చికిత్స పొందుతున్నారని సీఎం తెలిపారు. సీఎం ఈ రోజు  ప్రగతిభవన్‌లో కరోనా అంశంపై కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

‘పోలీసులకు సహకరించకపోతే 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. కనిపిస్తే కాల్చివేత(షూట్ ఎట్ సైట్)కు ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత కూడా పరిస్థితికి అదుపులోకి రాకపోతే అమెరికాలో మాదిరి ఆర్మీని మోహరించాల్సి వస్తుంది. అందుకే షూట్ ఎట్ సైట్, ఆర్మీని పిలిపించుకునే పరిస్థితి తీసుకురావద్దు. రష్యా కరోనా నుంచి అద్భుతంగా బయటపడింది. బయిటికస్తే ఐదేళ్లు జైల్లో వేస్తామని హెచ్చరించారు. అందుకే ఆ దేశంలో కరోనా జాడ లేదు. దయచేసి అందరూ సహకరించండి. మీకు చేతులు జోడించి కోరుతున్నా ’ అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోడానికి ఎలాంటి చర్యకైనా వెనకాబోమన్నారు. ఇళ్లలో క్వారంటైన్‌లో ఉన్న ప్రజలు పాస్ పోర్టులు కలెక్టర్ ఆఫీసులో ఉంచాలని కోరారు. మీడియా కూడా సహకరించాలని కోరారు.