ఎక్కువ రేట్లకు అమ్మితే జైలే.. కేసీఆర్ వార్నింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎక్కువ రేట్లకు అమ్మితే జైలే.. కేసీఆర్ వార్నింగ్..

March 24, 2020

Kcr warns shoppers on essential commodities price hike 

‘కరోనా సమయంలో కూరగాయలు, నిత్యావసరాల ధరలుపెంచి ప్రజల రక్తం పీల్చే వ్యాపారులను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. పీడీ యాక్ట్ తీసుకొచ్చి వారిని జైల్లో వేస్తాం. షాపులు రద్దవుతాయి. లైసెన్సులు పోతాయ్.. జీవితాలు, వ్యాపారాలు నాశనం అవుతాయ్.. ఇంత దుర్మార్గానికి ఎందుకు తెగబడుతున్నారు? ధరలు పెంచి రక్తం పిండితే చూస్తూ ఊరుకునేది లేదు..’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం కఠిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పారు. సమాజహితం కోరేవాళ్లు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. 

షాపులు సాయంత్రం ఆరుగంటలకే మూసేయాలని తేల్చి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం ఉండదని, అయితే గుంపులుగా ఉండకూదని ఆయన సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు కూడా ఇలాగే పూర్తి చేయాలన్నారు. కర్నూలు సరిహద్దు వద్ద కొన్ని ట్రక్కులు ఆగిపోయాయని, వాటిలోని సరుకు తెలంగాణ ప్రజలకు కూడా అవసరం కనుక టోల్ ఫీజ్ ఎత్తేస్తున్నామని చెప్పారు. కరోనా ప్రపపంచంలో చాలా తీవ్రంగా ఉందని, అయితే మనదేశంలో అదృష్టవశాత్తూ నియంత్రణలోనే ఉందని సీఎం చెప్పారు.