తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది నెలల తర్వాత మంగళవారం గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఉజ్జల్ భుయాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమంలో ఆయన గవర్నర్ తమిళిసైతో కలిసి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై పక్కపక్కనే కూర్చున్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గ్యాప్ రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆసక్తికరంగా మారింది. కాగా, తెలంగాణలో గత నాలుగేళ్లలో ఐదుగురు సీజేలు బాధ్యతలు చేపట్టినట్టయింది. అటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. గవర్నర్ సీజేతో ప్రమాణ స్వీకారం చేయించారు.