కేసీఆర్ సతీమణికి అస్వస్థత - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సతీమణికి అస్వస్థత

February 23, 2018

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, ఇతర అనారోగ్య  సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.  డాక్టర్‌ పీవీ రావు  వైద్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ఇతర కుటుంబ సభ్యులు గురువారం ఆస్పత్రికి చేరుకుని శోభ ఆరోగ్య పరిస్థితిని విచారిచారు.సీఎం వెంట భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా ఉన్నారు. శోభ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆమెను శుక్రవారం ఉదయం డిశ్చార్జ్‌ చేసే అవకాశముందన్నారు.