KCR will attend the meeting of CPI in Vijayawada
mictv telugu

వచ్చే నెలలో విజయవాడ వెళ్తున్న కేసీఆర్.. ఆ పార్టీ కోసమే

September 16, 2022

తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే నెలలో ఏపీలోని విజయవాడకు వెళ్లనున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన విజయవాడకు వెళ్లనుండగా, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కోసం ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించడానికి వెళ్లాడు. ఇప్పుడు వెళ్తుంది మాత్రం జగన్ కోసం కాదు. కమ్యూనిస్టుల కోసం. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్, బీహార్, కేరళ సీఎంలు నితీష్ కుమార్, పినరయి విజయన్‌లు హాజరుకానున్నారు. దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు, సీపీఐ జాతీయ స్థాయి నాయకులు రానున్నారు. వీరితో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నేతలు పాల్గొంటారు. అంతేకాక, 20 దేశాలకు చెందిన కమ్యూనిస్టు నేతలు వస్తున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక రానున్న తరుణంలో అక్కడ సీపీఐ, టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ మహాసభలకు కేసీఆర్ హాజరు కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.