తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం బయల్దేరనున్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. తర్వాత విపక్షాలకు చెందిన కీలక నేతలను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేసీఆర్తో పాటు కొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. కాగా, రాష్ర్టపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు పలికారు. ఆయన బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.