నష్టపోయాం.. 1,350 కోట్లు ఇవ్వండి.. మోదీకి కేసీఆర్ లేఖ  - MicTv.in - Telugu News
mictv telugu

నష్టపోయాం.. 1,350 కోట్లు ఇవ్వండి.. మోదీకి కేసీఆర్ లేఖ 

October 15, 2020

Kcr wrote letter to modi on flood control assistance

వందేళ్లలో కనీవినీ ఎరుగనంతటి వర్షాలు, వరదల్ల చిక్కుకున్న తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం వాటిల్లిందని, ఆర్థికంగా ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 

ఈమేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ‘భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందని సీఎం శ్రీ కేసీఆర్ వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు..’ అని వెల్లడించింది. మరోపక్క.. ప్రగతిభవన్‌లో సీఎం ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు,  హైదరాబాద్ కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. వరదబాధితుకు ఉపవనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.