అబ్బాయి పుడితే 12వేలు..అమ్మాయి పుడితే 13వేలు... - MicTv.in - Telugu News
mictv telugu

అబ్బాయి పుడితే 12వేలు..అమ్మాయి పుడితే 13వేలు…

May 24, 2017

సర్కార్ దవాఖానలో ప్రసవించే గర్భిణులకు కేసీఆర్ కిట్-అమ్మ ఒడి” పథకాన్ని జూన్ 3 నుంచి ప్రభుత్వం అమలు చేయబోతుంది.

ఈ పథకంలో భాగంగా అబ్బాయి జన్మిస్తే రూ.12 వేలు, అమ్మాయి జన్మిస్తే రూ. 13 వేల నగదును ఆ గర్భిణికి ఆన్‌లైన్ ద్వారా చెల్లించనుంది.

గర్భిణీ ప్రభుత్వ దవాఖానలో తన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు రెండు సార్లు ఆయా దవాఖానలో చికిత్సలు పొందుతూ ఐరన్ టాబ్లెట్లు వినియోగించిన అనంతరం రూ.3 వేలు అందిస్తారు.

అలాగే ప్రభుత్వ దవాఖానలో ప్రసవం పొందిన తరువాత ఆ చిన్నారికి బీసీజీ, ఓపీవీ, జీరో డోస్, హైపటైటీస్ బీ వ్యాక్సీన్‌లు అందించిన తర్వాత ఆడపిల్ల పుట్టిన తల్లికి రూ.5 వేలు, అబ్బాయి పుట్టిన తల్లికి రూ.4 వేలు చెల్లించనున్నారు.

మూడున్నర నెలల సమయంలో అందించే ఓపీసీ 1,2,3 డోస్‌లతో పాటు ఐవీపీ 1, పెంటావాలెంట్ వ్యాక్సిన్‌లు అందించిన అనంతరం మరో రూ. రెండు వేలు అందజేస్తారు.
చివరగా తొమ్మిది నెలల సమయంలో మరోమారు ఆ చిన్నారికి మీసెల్స్ వ్యాక్సిన్‌తోపాటు మిటమిన్ ఏ జేఈ మొదటి డోస్ అందించిన అనంతరం మరో రూ.3వేలు అందజేయనున్నారు. ఈ క్రమంలో మొత్తం ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన గర్భిణుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీల ప్రక్రియ సాగుతుంది.
KCR.కిట్‌లో విలువైన 15 వస్తువులు

ప్రభుత్వ దవాఖానలో పాప ప్రసవించిన రోజే కేసీఆర్ కిట్ ఇస్తారు. ఈ కిట్ లో 15 వస్తువులు ఉండగా అందులో నాలుగు వస్తువులు తల్లికి సంబంధించినవి ఉంటాయి.

చిన్నారి కిట్టులో..

రూ.350 విలువ చేసే దోమ తెర

రూ.90 విలువ గల బేబీ మాస్కిటోస్.

రూ.200 విలువ గల డ్రెస్‌లు,

రూ.100 విలువ చేసే రెండు టవల్స్

రూ.100 విలువ చేసే బేబీ న్యాప్‌కిన్స్

రూ.120 విలువైన జాన్సన్ బేబీ పౌడర్
రూ.85 విలువైన బేబీ షాంపో

రూ.200 విలువైన బేబీ ఆయిల్

రూ.90 బేబీ సబ్బు

రూ.25 బేబీ సోప్ బాక్స్

రూ.50 ఆట వస్తువులు

తల్లికి…
రూ.350 విలువ చేసే రెండు చీరలు

రూ.40 విలువ చేసే రెండు సబ్బులు

రూ.150 విలువైన కిట్‌బ్యాగ్

రూ.50 ప్లాస్టిక్ బకెట్ ఉంటాయి
తెలంగాణ ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకం వచ్చే నెల మూడు అమల్లోకి వస్తుంది.