కేంద్రంతో కయ్యానికి కేసీఆర్ రెడీ - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రంతో కయ్యానికి కేసీఆర్ రెడీ

May 24, 2017

కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి కేసీఆర్ సై అంటున్నారా. పచ్చి అబద్దాలు చెబుతున్నారంటూ అమిత్ షా పై ఒంటికాలుపై ఎందుకు లేచారు. కేంద్రం పై ఆధారపడి రాష్ట్రం బతుకుందా..రాష్ట్రంపై ఆధారపడి కేంద్రం ఉందో రుజువు చేయాలని సవాళ్ల మీద సవాళ్లు ఎందుకు విసిరారు. ఈ మాటల కాక ను చూస్తే కయ్యం పక్కా అనిపిస్తుంది.
ఇన్నాళ్లు కేంద్రంతో కలిసిమెలిసి ఉంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చారు. డీమానిటైజేషన్ టైమ్ లో మోదీ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో పలుమార్లు ప్రధానితో, కేంద్రమంత్రులతోనూ సమావేశమవుతూ వచ్చారు. వారి వినతుల్ని అలకించిన ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఇలా నడస్తున్న కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో అమిత్ షా టూర్ చిచ్చు రాజేసింది. కేసీఆర్ సర్కార్ పై అమిత్ విమర్శలు కయ్యానికి పురిగొల్పాయి.

మూడురోజుల తెలంగాణ పర్యటన అమిత్ షా అన్నీ పచ్చి అబద్దాలు చెప్పారని కేసీఆర్ అంత ఎత్తున లేచారు. కేంద్రం అదనంగా ఇస్తున్న నిధులు ఏంటో చూపాలని చాలెంట్ చేశారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు అమిత్ షా ఈ స్థాయిలో కాకున్నా… కేసీఆర్ సర్కార్ పై బాగానే విమర్శలు చేశారు. అప్పుడేదో తెలంగాణ మంత్రులు ప్రెస్ మీట్లు ఖండించారు. సీఎం కేసీఆర్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు..బహుశా ఎందుకు లే కేంద్రంతో ఘర్షణ వైఖరి అనుకున్నారేమో.. కానీ ఈ సారి ఏకంగా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చేశారు.
అమిత్ షా పై ఒంటికాలుపై లేస్తూ చెడుగుడు ఆడారు. పనిలో పనిగా రాష్ట్రపతి ఎన్నికలపై కేసీఆర్ మాట్లాడారు.”మోదీ అంటే గౌరవం ఉంది.. కేంద్రంతో వైరం లేదు. కేంద్రంతో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం. పెద్ద నోట్ల రద్దు సమయంలో మోదీకి మద్దతు ఇచ్చిన ఒకే ఒక్క సీఎం నేనే. రాష్ట్రపతి ఎన్నికల గురించి ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతి ఎన్నికపై పార్టీలో సమష్టి నిర్ణయం తీసుకుంటాం” అని కేసీఆర్ అన్నారు. ఇప్పడు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ ఎస్ మద్దతు ఇస్తుందా అనేది సంశయమే. అమిత్ కామెంట్స్ పై గులాబీ గుస్సా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.