డాటర్ అఫ్ కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

డాటర్ అఫ్ కేసీఆర్

June 14, 2017


సీఎం కేసీఆర్ సారు శానా దిల్లున్నోడు, దిమాకున్నోడు గాబట్టే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిక్కు జల్ది జల్ది పోతున్నది. ఆయనది మానవతా హృదయమని అనచ్చు. ఎందుకంటే పోయిన త్యాప మర్మన్న తల్లి శేతుల ప్రత్యూష అనే గీ పొల్ల పాపం శితాం దెబ్బలు తిని, టార్చర్ అనుభవిచ్చి.. అనుభవిచ్చి సావు కడ్పట్లదాకా పొయ్యి మర్లచ్చింది. అట్ల మల్పుకచ్చి ఆమెకు భవిష్యత్తు తొవ్వ జూపిచ్చిన దిల్ దార్ సాబ్ కేసీఆర్..

పాపం అప్పుడు ప్రత్యూష ఆగమాగం అడవడివి అయుండే.. పెద్దమన్షి ఆదుకొని ఆమెను దత్తపుత్రికను చేస్కొని ప్రత్యూష దిక్కుల దీపమైండు. ఇప్పుడా పొల్ల నర్సింగ్ కోర్సు చేస్తుందన్న సమాచారాన్ని అధికారులు శెప్పంగనే శానా కుష్ అయిండు సారు. అంతే గదా.. కేసీఆర్ సారు ఏ కాయిషుతోని ప్రత్యూషను దత్తత తీస్కున్నడో ఆ కాయుషును ప్రత్యూష నిజం జేస్తున్నది గదా.. గందుకే సారు సంబురంను ఆగవట్టలేక పోతున్నడట.

ఇదంత ముద్దుగనే , సీఎం సారు జేస్తున్న పన్లు ఫాయిదలనే ఉన్నాయి సరేగానీ గీ సోయిని బాలికల సంక్షేమం మీద, మహిళల ఉద్దార్కం మీద ఇంక జర ఎక్క వెడ్తె శాన మంచిగుంటదని ఆడ సంఘాలోల్లు అనుకుంటున్నరు. ఎందుకంటే సీఎం సారు అనుకుంటున్నట్టు బంగారు తెలంగాణ కావాల్నంటే ఆ తెలంగాణ తల్లి శేతుల నిండ ఈ గడ్డ ఆడివిల్లలు బంగారి గాజులు గావాలె.. అంటే ఏం జెయ్యాల్నో సారుకు ఎర్కనే. ఎల్గులకు రాని శాన మంది ప్రత్యూషలను ఈ తెలంగాణ సర్కారే ఆదుకునాలె, ఆపన్న హస్తం అందియ్యాలని అనుకుంటున్నరు.