కేసీఆర్ కిట్ల పంపిణీ షురూ... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ కిట్ల పంపిణీ షురూ…

June 3, 2017

తెలంగాణలో కేసీఆర్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మాతాశిశు సంరక్షణలో భాగంగా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబుర్జు ఆస్పత్రిలో ప్రారంభించారు. మేకల సవిత, రషీదా బేగం, నవనీత, మెహజెబీన్‌, సరిత, తబస్సుమ్‌ అనే ఆరుగురు బాలింతలకు కేసీఆర్‌ స్వయంగా కిట్లు అందించారు. కాన్పు జరిగిన తర్వాత 16 వస్తువులతో కూడిన ఈ కిట్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆడపిల్ల పుడితే రూ.13,000, మగబిడ్డ పుడితే రూ.12,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుంది.

అంతకు ముందు ఆయన ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించారు.రోగులు, వైద్యులతో మాట్లాడి అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు.