SRSP కి జన సంద్రం..!

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పూర్వకళ తీసుకువచ్చే మహత్తర పునరుజ్జీవ కార్యక్రమానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు.అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం భారీగా తరలి వచ్చారు,ట్రాక్టర్లు,డిసియంలు కట్టుకుని మరీ వస్తున్న అన్నదాతలు,15 కిలోమీటర్లు మేరకు నిలిచి పోయిన వాహనాలు.

ఈరోజు ఉదయం ప్రత్యేక వాహనంలో మోప్కాల్‌ గ్రామానికి చేరుకుని వరద కాలువ హెడ్‌ రెగ్యులేర్‌ వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.ఎస్సారెస్పీ పునరుజ్జీవనంలో భాగంగా మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం వరకూ గోదావరి నదిలోనే రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని తరలించనున్నారు.

SRSP పునరుజ్జీవంతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. జగిత్యాల నుంచి పోచంపాడు సభకు బయల్దేరిన ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు.  సభను సక్సెస్ చేసేందుకు.. రైతులు పెద్ద సంఖ్యల తరలి వస్తున్నారు.ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో.. తమ జీవితాలు బాగుపడతయంటున్నారు రైతులు..సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు.SRSPకి పునరుజ్జీవంతో ఐదు జిల్లాల ప్రజలకు ఎంతో మంచి జరగబోతుంది.కళాకారుల ఆటపాటలతో శురువైన  పోచంపాడు బహిరంగ సభ.

 

 

 

SHARE