KCR's blessings for Nalgonda district..this time
mictv telugu

నల్గొండ జిల్లాపై కేసీఆర్ వరాల జల్లు..ఈసారి

August 14, 2022

తెలంగాణ రాష్ట్రంలో ‘పోరాటాల కిల్లాగా’ ప్రసిద్దిగాంచిన నల్గొండ జిల్లాపై కేసీఆర్ వేగం పెంచారు. ఇప్పటికే జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణం, పాత భవనాలకు మరమ్మత్తులు, కొత్త భవనాలకు శంకుస్థాపన, కూడళ్ల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి కోసం సమారు రూ.138 కోట్లను విడుదల చేసిన ఆయన..మరోసారి నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించారు.

ఎన్డీఎఫ్ ద్వారా నల్గొండ జిల్లా అభివృద్ది కోసం మరో రూ. 233 కోట్ల నిధులను మంజూరు చేస్తూ, శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి దక్కని స్థాయిలో ఒకేసారి పెద్ద మొత్తంలో రూ. 233 కోట్లు ఎన్డీఎఫ్ నిధులు నల్గొండ జిల్లాకు మంజూరు కావటం సంచలనంగా మారింది. తాజాగా విడుదల చేసిన నిధుల ద్వారా.. జిల్లా కేంద్రంలో ఆడిటోరియం నిర్మాణం, పానగల్‌లో ఉన్న చరిత్రాత్మకమైన ఆలయాల అభివృద్ధిని చేయనున్నారు. రూ. 90 కోట్లతో కళాభారతి.. పట్టణంలో కళాభారతి(ఆడిటోరియం) నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ. 90. 61 కోట్లు కేటాయించారు.

”నల్గొండ జిల్లాలో కళాభారతి అందుబాటులోకి వస్తే కవులు, కళాకారులు, సినిమా రంగం వారికి మంచి ఉపయుక్తంగా ఉండనుంది. పానగల్‌కు పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఇన్ని రోజులపాటు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా జిల్లాలో పేరుగాంచిన ప్రదేశాలు చాలానే ఉన్నా ఆదరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు జిల్లా కేంద్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ బాటలు వేయడంతో.. పర్యాటకులను ఆకర్షించేలా హైదరాబాద్ తరహాలో నల్గొండలోని ఉదయ సముద్రాన్ని మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేయడంతోపాటు, దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పచ్చల సోమేశ్వరస్వామి, ఛాయ సోమేశ్వరస్వామి, మేకటేశ్వరస్వామి ఆలయం, వల్లభరావు చెరువు సుందరీకరణ జరగనుంది. ఐటీ హబ్ వరకు రోడ్డు నిర్మాణాలకు రూ. 139.21 కోట్లు కేటాయిడంతో..పానగల్ రూపురేఖలు మారనున్నాయి. త్వరలోనే నీలగిరికి పర్యాటక ప్రాంతంగా మారనుంది”.