వెంకయ్య అద్భుత వక్త: కేసీఆర్  - MicTv.in - Telugu News
mictv telugu

వెంకయ్య అద్భుత వక్త: కేసీఆర్ 

August 21, 2017

ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడిని సత్కరించే అవకాశం తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వానికి దక్కడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున వెంకయ్యకు సీఎం హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇవాళ వెంకయ్య అత్యున్నతమైన శిఖరాన్ని అధిరోహించడం గొప్పగా ఉంది. అందుకు మనందరం గర్వించాలి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి, తెలుగు భాషకు గౌరవం దక్కింది. మళ్లీ ఇప్పుడు తెలుగు వ్యక్తి ఉపరాష్ర్టపతిగా బాధ్యతలు చేపట్టడం గర్వించదగ్గ విషయం’ అని సీఎం అన్నారు.

భారతదేశంలోనే వెంకయ్య అద్భుతమైన వక్త అని ఆయన కొనియాడారు. ‘తన మాటలతో వెంకయ్య అందరిని అబ్బురపరుస్తారు. ఉపన్యాసాన్ని పండించడంలో వెంకయ్యనాయుడు దిట్ట.  వ్యంగ్యం, హాస్యం, రౌద్రం అన్నీ కలిస్తేనే పరిపూర్ణమైన ఉపన్యాసం.. ఇవన్నీ వెంకయ్య ఉపన్యాసంలో కనిపిస్తాయి. తెలుగు బిడ్డ ఉప రాష్ర్టపతి కావడం తెలుగు భాషకే గర్వకారణమన్నారు. తెలుగు ఒక్కటే కాదు.. ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడే వ్యక్తి వెంకయ్య అని కేసీఆర్ తెలిపారు. ఉపరాష్ర్టపతి పదవికి వెంకయ్య వన్నె తెస్తారన్నారు. ‘వెంకయ్య సాధారణమైన వ్యక్తి. సామాన్య కార్యకర్త నుంచి ఉపరాష్ర్టపతి స్థాయికి ఎదగడం సంతోషం’ అని అన్నారు.