Kct boycott niti ayog meeting in delhi
mictv telugu

నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నా… కేసీఆర్

August 6, 2022

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనురిస్తున్న ప్రజా వ్యతిరేక, రాష్ట్ర వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం ఢిల్లీలో జరిగే ‘నీతి ఆయోగ్’ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానని తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆయన శనివారం విలేకర్ల సమావేశంలొ మాట్లాడారు. మోదీ తన హామీలను ఏమాత్రం నెరవేర్చడం లేదని అన్నారు.
‘ఏ దేశమైనా, సమాజమైనా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. అందుకే మన జాతీయ నాయకులు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహించారో తెలిపారు. మంచివాళ్లు చెబితే విని పాటించే సంస్కారం ఆనాటి ప్రధానులకు ఉండేది. భాక్రనంగల్ వంటి ప్రాజెక్టులను చేపట్టారు. మోదీ అధికారంలోకి వచ్చాక ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ తెచ్చారు.

https://www.facebook.com/watch/live/?ref=watch_permalink&v=810434556887480

కానీ ఇప్పుడు సహకార సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినింది. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదు. నీతి ఆయోగ్ నిష్క్రియా పరమైన సంస్థగా మారిపోయింది. ప్రధానికి భజన మండలిగా మారిపోయింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంతో నీతి ఆయోగ్‌లో నీతి అంతే. నీతి ఆయోగ్ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత జరిగిందేమీ లేదు. అదో పెద్ద జోక్. దేశంలో ఎప్పుడూ లేదని దురవస్థ దాపురించింది. విద్వేషం, అసహనం పెరిగాయి. రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనలో 800మంది రైతులు చనిపోయారు. తెలంగాణలో తప్ప మరే రాష్ర్టంలోనూ ఉచిత కరెంటు లేదు. దేశంలో నీళ్లు లేవు. మరి నీతి ఆయోగ్ ఏం సాధించినట్టు? దేశంలో నిరుద్యోగం పెరిగింది. అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నేను నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం లేదు.. ’’ అని సీఎం చెప్పారు.