Keep guns, stones and shovels in your shops: BJP MLA
mictv telugu

మీ షాపుల్లో తుపాకులు, రాళ్లు, గడ్డపారలు పెట్టుకోండి: బీజేపీ ఎమ్మెల్యే

July 11, 2022

అధికారంలో ఉన్న ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాయి. ”మీ షాపుల్లో రెండు పెట్టెల్లో రాళ్లు పెట్టుకోండి. నాలుగైదు గడ్డపారలు కూడా ఉంచుకోండి. అలాగే, రెండు తుపాకులు కూడా పెట్టుకోండి. పోలీసులు మాత్రం ఎంతకాలమని పనిచేస్తారు. పోలీసులు వచ్చే సరికి మీ దుకాణాలను తగలబెట్టేస్తున్నారు” అని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రం సైనీ అన్నారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్, ఎమ్మెల్యే విక్రమ్ సైనీలకు జన్సత్ తహసీల్ ప్రాంతంలోని వాజిద్‌పూర్ కావాలి గ్రామంలో ఇటీవలే ఘనంగా సన్మానం సభ జరిగింది. అనంతరం విక్రం సైనీ మాట్లాడాలిన మాటలన్నింటిని ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దాంతో ఆ వీడియో కొద్ది నిమిషాల్లో కొన్ని వందల షేర్లు అయ్యింది.

ఆ వీడియోలో విక్రం సైనీ మాట్లాడుతూ.. ”రెండు పెట్టెల్లో రాళ్లు పెట్టుకోండి. నాలుగైదు గడ్డపారలు కూడా ఉంచుకోండి. అలాగే, రెండు తుపాకులు కూడా పెట్టుకోండి. పోలీసులు మాత్రం ఎంతకాలమని పనిచేస్తారు. పోలీసులు వచ్చే సరికి మీ దుకాణాలను తగలబెట్టేస్తున్నారు. నన్ను మాట్లాడనివ్వండి. ఇది న్యూస్‌ పేపర్లలో రాసుకోమనండి. టీవీల్లో చూపించుకోమనండి. ఐదేళ్ల వరకు ఎవరూ నన్నేమీ చేయలేరు. నాకు ఇంతకుమించిన కోరిక కూడా లేదు” అని ఆయన అన్నారు.

ఇక, చివరగా ఉదయ్‌పూర్ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘నుపుర్ శర్మ మాట్లాడడం ఆమె ప్రజాస్వామ్య హక్కు. హిందూ దేవతలకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చా?. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం తల నరికేస్తారా?’ అని విక్రం సైనీ ప్రశ్నించారు.