కీర్తి సురేష్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు.. - MicTv.in - Telugu News
mictv telugu

కీర్తి సురేష్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు..

September 13, 2019

యువ కథానాయకి కీర్తి సురేష్ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చి చేరింది. ఓనం పండగ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఆమెకు  రాష్ట్ర పురస్కారాన్ని అందించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ‘మహానటి’ ఈ పురస్కారాన్ని స్వీకరించింది. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడంతో తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొంది. మంచి పాత్రలు ఎంచుకుంటూ నటిగా ఇంకా ఎదగాలనుకుంటున్నానని అంది. గత ఏడాది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి మెప్పించింది.

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయం సాధించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటనకు ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు లభించింది. త్వరలోనే రాష్ట్రపతి నుంచి కీర్తి ఈ పురస్కారం అందుకోనుంది. ఈ అవార్డు అందుకునేలోపే కీర్తి సురేష్ కేరళా పురస్కారాన్ని అందుకుంది.