సర్కారు వారి పాట హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది - MicTv.in - Telugu News
mictv telugu

సర్కారు వారి పాట హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది

October 17, 2020

bcgnbgcn

సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట సినిమాతో మాస్ లుక్‌లో రాబోతున్నాడు. ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరో ఎవరు అనే సందిగ్ధత ఉండేది. కానీ తాజాగా వాటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఓ పోస్ట్ చేసింది. మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించబోతోందని అధికారికంగా ప్రకటించింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. తమ టీంలోకి ఆహ్వానిస్తూ పోస్టర్ విడుదల చేసింది. 

ఇటీవల వరకు కూడా కీర్తి సురేష్ హీరోయిన్ అనే ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది. అదే నిజమై హీరోయిన్‌గా ప్రకటించారు. దీంతో ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. బ్యాంక్ మేనేజర్ లుక్‌లో అతడు కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై ఈ సినిమా తీస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.