కీర్తిసురేశ్. మహానటి మూవీతో సంపాదించుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా దసరా మూవీతో మార్చి 30 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో డిజైనర్ శారీధరించి కీర్తిసురేశ్ సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ కలర్ శారీలో గ్లామరస్ ఫోటో షూట్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ముఖ్యంగా ఆమె కైపెక్కించే చూపులు కుర్రకారు గుండెల్ని పిండేసాయి.
నాని నటించిన దసరా మూవీపై భారీగా అంచనాలుఉన్నాయి. ఈ మూవీ టీజర్ , పాటలు ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా హిట్ లేక అల్లాడుతున్న నాని ఈ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఇక కీర్తిసురేశ్ మీద రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో రోమాన్స్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు విజయ్ తో పెళ్లే చేసేసింది సోషల్ మీడియా. స్టార్ హీరో విజయ్ తో ఆమె డేటింగ్ చేస్తుందంటూ..ఇది తెలిసిన విజయ్ భార్య డైవర్స్ ఇస్తున్నారంటూ ఎన్నో స్టోరీలు వచ్చాయి. మొత్తానికి విజయ్ తన భార్యతో ఓ ఈవెంట్ కు హాజరై రుమార్స్ కు కాస్త చెక్ పెట్టేశారు.
కాగా కీర్తి సురేశ్ భోళా శంకర్ మూవీతోపాటు దసరా మూవీలో నటిస్తోంది. తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తోంది. జయం రవితో జంటగా నటిస్తోంది. ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో వస్తున్న మామన్నన్ మూవీలో కీర్తి నటిస్తోంది.