చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్! - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్!

October 28, 2020

Keerthy suresh to act as chiranjeevi sister

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. అలాగే మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో నటించడానికి సన్నద్ధం అవుతోన్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. తమిళంలో అజిత్ కుమార్ నటించిన ‘వేదాలం’ సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా తొలుత సాయి పల్లవిని అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు మహానటి కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మెహర్ రమేష్‌తో పాటు చిరంజీవి కూడా కీర్తి సురేష్ సంప్రదించారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి గుండుతో కనిపిస్తారని అంటున్నారు. అందుకే ఆమధ్య గుండు గెటప్ తో ట్రయిల్ ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో ఆయన వదిలారు. మెహర్ రమేష్ చివరిసారిగా 2013లో వెంకటేష్‌తో ‘షాడో’ సినిమా చేసాడు.