కీసర ఎమ్మార్వో కేసులో ట్విస్ట్.. గుట్టలు గుట్టలుగా ఆస్తులు - MicTv.in - Telugu News
mictv telugu

కీసర ఎమ్మార్వో కేసులో ట్విస్ట్.. గుట్టలు గుట్టలుగా ఆస్తులు

August 15, 2020

Keesara MRO Assets

భూమి పట్టా చేసేందుకు రూ. 1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర అవినీతి ఎమ్మార్వో కేసులో ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కూడబెట్టిన ఆస్తులను చూసి అధికారులే అవాక్కయ్యారు. తహశీల్దార్ నాగరాజు వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తి ఉంటుందని అంచనా వేశారు. ఇలాంటి అనేక సెటిల్ మెంట్ చేసి అక్రమంగా డబ్బు కూడాబెట్టారని అంటున్నారు. 

హైదరాబాదు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసిన పత్రాలను గుర్తించారు. వీటితో పాటు దాదాపు 2 కిలోల బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో ఉన్న రెండు లాకర్లను కూడా సీజ్ చేశారు. వీటిపై పూర్తి విచారణ జరిపితే పెద్ద ఎత్తున ఆస్తులు బయటపడతాయని అంచనా వేస్తున్నారు. కాగా రియల్ ఎస్టేట్ వ్యక్తులకు 28 ఎకరాల భూమిని బదలాయించేందుకు రూ. 2 కోట్ల లంచం డిమాండ్ చేశారు. అందులో మొదటి విడతగా.. రూ. 1.10 కోట్లు తీసుకొని ఇంటికి వెళ్లగానే.. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.