కీసర మాజీ ఎమ్మార్వో అవినీతి లీలలు.. మరో కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

కీసర మాజీ ఎమ్మార్వో అవినీతి లీలలు.. మరో కేసు నమోదు

September 26, 2020

gngbn

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు చేసిన లీలలు రోజుకోకటి బయటకు వస్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆయనపై మరో కేసు నమోదు చేశారు. 24 ఎకరాల భూమిని అక్రమంగా నలుగురికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఈ కేసు పెట్టారు. దీనికి రూ. 2 కోట్ల లంచం కూడా తీసుకున్నాడని పేర్కొన్నారు.  ఇంకా ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

రాంపల్లిలోని వేర్వేరు సర్వేనెంబర్లలో ఉన్న 24.16 ఎకరాల భూమి కొంతమందికి అక్రమంగా పాసు పుస్తకాలు జారీ చేశారని గుర్తించారు. ఆర్డీవో వద్ద వీటి పంచాయితీ ఉండగానే ఆయనకు కూడా తెలియకుండా పని పూర్తి చేశాడు. ఈ భూముల విలువ రూ. 2.68 కోట్లుగా ఉంటుందని గుర్తించారు.మార్కెట్‌ విలువ ప్రకారం రూ.48.80 కోట్లుగా ఉంటుందని అన్నారు. దీన్ని కందడి లక్ష్మమ్మ, కందడి బుచ్చిరెడ్డి, కందడి మణెమ్మ, కందడి ధర్మారెడ్డికి రిజిస్ట్రేషన్ చేశాడని తేలింది. జులై 9న నాగరాజు డిజిటల్ సంతకం చేసినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు.