రూ. కోటి లంచం కేసు.. కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

రూ. కోటి లంచం కేసు.. కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య

October 14, 2020

నకిలీ పాసు పుస్తకాల జారీ కోసం రూ. కోటి 10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడి దేశంలోనే సంచలనం సృష్టించిన కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు  ఆత్మహత్య చేసుకున్నారు. చంచలగూడ జైలులో అతడు ఉన్న గదిలో ఉరివేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన జైలు సిబ్బంది వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోవడంతో పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. మరో కేసులో అరెస్టు అయిన తర్వాత కొన్ని గంటల్లోనే ఇది జరిగింది.  ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. 

భూ వ్యవహారం కేసులో నాగరాజును నెలరోజులుగా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇటీవలే ఆయనపై మరో భూ అక్రమ బదలాయింపు కేసులో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలులో రిమాండ్‌లో ఉండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్‌ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని అధికారులు గుర్తించారు. వరుసగా కేసుల్లో ఇరుక్కోవడంతో మనస్థాపంతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.