రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఆటో ఎక్స్పోలో కొత్త కొత్త వాహనాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో భారత్లో నియోక్లాసిక్ బైక్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీంతో టూవీలర్ తయారీదారులు కంపెనీలు వీటిపై దృష్టి సారిస్తున్నాయి. హంగేరియన్ ద్విచక్రవాహన తయారీదారు సంస్థ అయిన కీవే.. ఈ ఆటో ఎక్స్పో-2023లో కీవే 250ఎస్ఆర్ బైక్ను పరిచయం చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కీవే ఇండియా ఇప్పటికే ఎస్ఆర్ 125ను రిలీజ్ చేసింది. కాగా ఈ ఏడాది మరో బైక్ ఎస్ఆర్ 250ను రిలీజ్ చేసింది. ఈ రెట్రో మోటార్ సైకిల్ దేశీయ మార్కెట్లో టీవీఎస్ రోనిన్, రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350, కవాసకి డబ్ల్యూ175 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ బైక్ భారత్లో ఈ విభాగంలో గట్టిపోటీని ఎదుర్కొక తప్పదు. ఈ బైక్ చూసేందుకు దాని ఇంతకు ముందులాంటి మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇందులో కొన్ని అప్ డేట్ఫీచర్లు ఉన్నాయి.
డిజైన్
కీవే ఎస్ఆర్250 మోటార్ సైకిల్ మంచి డిజైన్తో వస్తుంది. ఈ బైక్ రౌండ్ హెడ్ల్యాంప్ , టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ సరౌండ్లతో కూడిన ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఫ్యూయల్, ఫిల్లర్ క్యాప్, సిలిండర్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్, నాబ్డ్ టైర్లు, స్పోక్డ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో సింగిల్ పీస్ సీటు కూడా ఉంటుంది.
ఫీచర్స్
ఇక ఫీచర్స్ గురించి చర్చిస్తే…ఈ బైకులో కలర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ , సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, ఎల్ఈడీ డీఆర్ఎల్ , హజార్డ్ స్విచ్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. వీటితోపాటు ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీసీ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా వాహనదారుడికి మంచి రైడింగ్ ఫీల్ అందించడంలో సహాయపడతాయి.
ధర
దేశీయ మార్కెట్లో రిలీజ్ అయిన ఈ కొత్త కీవే ఎస్ఆర్ 250 మోటార్ సైకిల్ 223 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ బరువు కేవలం 120 కేజీలు. కాబట్టి రైడింగ్ కూడా చాలా తేలికగా ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 1,19,000. మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. గ్లోసి రెడ్, గ్లోసి బ్లాక్, గ్లోసి వైట్ కలర్స్ ఉన్నాయి. ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ధరలు ఒకేవిధంగా ఉన్నాయి. కలర్ ను బట్టి ధరలు మారే అవకాశం లేదు.