Kejriwal started virtual school in delhi
mictv telugu

స్కూలుకు వెళ్లి చదవడానికి ఇబ్బంది పడుతున్నారా.. మీకోసమే స్పెషల్‌గా..

August 31, 2022

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్కూలుకు వెళ్లి చదవడానికి ఇబ్బంది పడే విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా వర్చువల్ స్కూల్‌ ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ పాఠశాలను ప్రారంభిస్తున్నట్టు బుధవారం మీడియా సమావేశం పెట్టి వెల్లడించారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి అనుబంధంగా ఈ పాఠశాల కొనసాగుతుందని వివరించారు. ఇందులో ప్రవేశాలను దేశవ్యాప్తంగా కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. తొమ్మిదో తరగతిలో చేరడానికి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ స్కూలులో చేరే విద్యార్ధులు ఆన్‌లైన్లో పాఠాలు వినవచ్చని, స్కూలు నుంచి సిలబస్ పుస్తకాలు కూడా అందుకోవచ్చని స్పష్టం చేశారు. అంతేకాక, విద్యారంగంలో నూతన విప్లవానికి నాంది అని, త్వరలో మరిన్ని మార్పులు తీసుకొస్తామని అన్నారు.