ఢిల్లీ అల్లర్ల కుట్రదారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేజ్రీవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ అల్లర్ల కుట్రదారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేజ్రీవాల్

February 28, 2020

ghmvghy

ఢిల్లీలో ఇటీవల ఉన్నట్టుండి రాజుకున్న హింసా కాండపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీనికి కారణమైన వ్యక్తుల కోసం అన్వేషిస్తుండగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్‌‌పై కేసు నమోదు చేశారు. అతడే ఈ ఘటనలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఇంట్లో లభించిన పెట్రో బాంబులు, యాసిడ్ బాటిళ్ల ఆధారంగా చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.  

అల్లర్లకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నందున తాహిర్ హుస్సేన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీకి చెడ్డ పేరు రాకుండా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంత కాలం వరకూ కేంద్రం కుట్రగా భావించిన కేజ్రీకి సొంత పార్టీ నేత నుంచే ఊహించని షాక్ ఎదురవడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. కాగా తాహిర్ హుస్సేన్‌ కోసం గాలింపు ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఇంకా భద్రతా బలగాలు మోహరించే ఉన్నాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం గస్తీ కాస్తున్నారు.