దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 13,404 పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుండగా, దానిని జనవరి 2 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 5న దరఖాస్తు ప్రక్రియ మొదలవగా, అభ్యర్ధులకు ఉపశమనం కల్పిస్తూ అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు. విద్యార్హత, పని అనుభవం, వయసు తదితర అంశాల్లో ఎలాంటి మార్పు లేదని, దీన్ని గమనించాలని కోరారు. పరీక్షా తేదీని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండలు ఉండగా, ఏపీలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నం, అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి పట్టణాలు ఉన్నాయి. పోస్టును బట్టి దరఖాస్తు ఫీజు రూ. 1200 నుంచి రూ. 2300 వరకు ఉంది. మరిన్ని వివరాలు కావాలంటే http://kvsangathan.nic.in/ ని సందర్శించవచ్చు.