Home > Corona Updates > ఒత్తిడి వద్దు ధైర్యంగా ఉండు.. నర్సుల జుంబా డ్యాన్స్

ఒత్తిడి వద్దు ధైర్యంగా ఉండు.. నర్సుల జుంబా డ్యాన్స్

Zumba Dance

కరోనా రోగులకు వైద్యం అందించే నర్సుల్లో ఒత్తిడిని వదిలించి, ధైర్యం నింపే క్రమంలో నర్సులు డ్యాన్స్ చేశారు. రోగులతో సహా నర్సులను కాసేపు ఉల్లాస పరిచారు. రోగులకు సేవలు అందిస్తున్న తమకేం కాదు తప్పకుండా ఈ కరోనాను జయిస్తాం అనే స్థైర్యాన్ని వారికి అందించారు. కెన్యాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు జుంబా డ్యాన్స్ చేసి ఆసుపత్రిలో ఒక్కసారిగా జోష్ నింపేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐసోలేషన్ వార్డుల్లో పనిచేసే నర్సులతో ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబాలను వదిలి 24 గంటలు కరోనా రోగుల సేవల్లో తరిస్తున్న నర్సుల్లో ఆందోళనను తగ్గించడానికి ఇదో ప్రయత్నమని అధికారులు అన్నారు.

నర్సులందరూ మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ జుంబా డ్యాన్స్‌లో పాల్గొన్నారు. మొత్తం 50 మంది ఆరోగ్య కార్యకర్తలు రెండు గంటల పాటు జుంబా డ్యాన్స్‌ చేశారు. కాగా, కెన్యాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 912కు చేరుకుంది. కరోనా కారణంగా కెన్యాలో మొత్తం 50 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో కెన్యాలో 25 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 1139 శాంపిల్స్‌ను పరీక్షించగా 25 పాజిటివ్ కేసులు వచ్చినట్టు తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి 22 మంది కోలుకున్నారని.. దీంతో కోలుకున్న వారి సంఖ్య 336కి చేరుకున్నట్టు వివరించింది.

Updated : 18 May 2020 12:08 PM GMT
Tags:    
Next Story
Share it
Top