Home > Featured > కరోనా హ్యాండ్‌వాష్.. అదిరిందయ్యా ఆటో డ్రైవరూ!

కరోనా హ్యాండ్‌వాష్.. అదిరిందయ్యా ఆటో డ్రైవరూ!

auto rickshaw.

కరోనా వైరస్ మనషుల జీవితాలను పూర్తిగా మార్చేసింది. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అని చరిత్రను తిరగరాసుకుంటున్నాం. కంటికి కనిపించని ఆ మహమ్మరి ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఉన్నంతలో ఏదో ఒక సబ్బో, శానిటైజరో కొనుక్కుని కడుక్కుంటున్నాం. ఇంట్లో ఫర్వాలేదుగాని బయటికి వెళ్లినప్పుడు అన్ని చోట్లా శానిటైజర్లు ఉండవు కదా. షాపుల్లో పరమపిసినారుల్లా ఒక చుక్క వేసి కడుక్కోమంటున్నారు. బస్సులు, రైళ్లు, వాహనాల్లో ప్రయాణించేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి రావడంతో కొందరైతే మంచినీళ్ల బాటిళ్లలాగా శానిటైజర్లు బ్యాగుల్లో వేసుకెళ్తున్నారు. కొందరు వాటితో రుద్దుకుని, ఎక్కడ కడుక్కోవాలో తెలియక ఆల్కహాల్ వాసన బాగానే ఉందిలే సరిపెట్టుకుంటున్నారు.

ఈ కష్టాలన్నీ గమనించిన ఓ ఆటో డ్రైవర్ అదిరే ఐడియా వేశాడు. తన బండి ఎక్కే కస్టమర్ల కోసం సబ్బునీళ్లతో పాటు చేతులు కడుక్కునే సదుపాయాన్ని కూడా కల్పించాడు. ఒక గొట్టాన్ని నీటి ట్యాంకులాగా మార్చి దానికి ట్యాప్ పెట్టాడు. దాని పైభాగంలో సబ్బునీళ్ల బాటిల్ తగిలించాడు. ఎవరైనా ఆటో ఎక్కడానికి వస్తే ముందు నీళ్లతో చేతులు కడుక్కుని, తర్వాత సబ్బు నీళ్లతో కడుక్కోమని చెబుతున్నాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఆటో బావుంది కదా అని జనం కూడా సై అంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ ఆటో వీడియోను ట్వీట్ చేయడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కేరళలోని తిరుగుతోందీ శానిటైటర్ బండి.

Updated : 3 Jun 2020 4:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top