వాయ్.. కేరళలో మరో మెస్సీ పుట్టాడు (వీడియో)
అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ప్రపంచంలో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నాడు. తన కిక్‌తో ఫుట్ బాల్ తన్నితే గోల్ కోస్టులో పడాల్సిందే. ఇంతటి పాపులార్టీ తెచ్చుకున్న ఆటగాడిని మైమరిపించేలా ఓ బుడతడు తన ఆటతీరుతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. తన ఫ్రీ కిక్‌తో నేరుగా బాల్ గోల్ పోస్టులో పడేలా చేశాడు. అతని ఆట చూసిన ఫుట్‌బాల్ ప్రియులు నిజంగా మరో మెస్సీ పుట్టాడా అని ఆశ్చర్యపోతూ చర్చించుకుంటున్నారు. ఈ బుడతడు మరెవరో కాదు.. మన దేశానికి చెందిన వాడే కావడం విశేషం.
కేరళకు చెందిన 12 ఏళ్ల బాలుడు చేసిన గోల్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. దీంట్లో ఆ బాలుడు అచ్చం మెస్సీని దించేశాడు. మెస్సీ జెర్సీ నెంబర్ 10ని ధరించి చేతితో వెంట్రుకలు అటూ ఇటూ కదుపుతూ.. బంతిని తన్నగానే ఎదురుగా ఉన్న గోల్‌కోస్ట్‌లో పడిపోయింది. ఆ వెంటనే అతనిలాగే మొకాళ్ల మీద నిల్చుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కేరళ సెవెన్స్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వీడియో పోస్టు చేసింది. కాగా 52 ఏళ్ల మెస్సీ తన కెరీర్‌లో 697 గోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బుడ్డోడికి కూడా అంతటి భవిష్యత్ ఉంటుందని పలువురు ఫుట్ బాల్ ప్రేమికులు ధీమాగా చెబుతున్నారు.