Kerala boy makes wine by watching YouTube video, friend hospitalised after drinking it
mictv telugu

యూట్యూబ్ చూసి వైన్ తయారుచేసిన బాలుడు.. స్నేహితుడిపై ప్రయోగం

July 30, 2022

ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న కారణంగా పిల్లలకు ఏది మంచో, ఏది చెడో తెలుసుకోలేకపోతున్నారు. యూట్యూబ్‌లో వీడియో చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారుచేసిన ఓ బాలుడు(12).. అది పనిచేస్తుందో లేదో అని తన మిత్రుడిపై ప్రయోగించాడు. ఆ వైన్ తాగిన అనంతరం వాంతులు చేసుకొని ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన కేరళ తిరువనంతపురం చిరాయింకీజులో శుక్రవారం జరిగింది. కల్తీ మద్యం తాగిన బాలుడిని చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వైన్ బాటిల్‌ను స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.

బయటి నుంచి తల్లిదండ్రులు కొనుగోలు చేసి తెచ్చిన ద్రాక్ష పండ్లను వైన్‌గా మార్చాలనుకున్నట్లు ఆ బాలుడు తెలిపాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆ ద్రాక్ష పండ్లను జ్యూస్ గా చేసి ఆ తర్వాత మద్యం తయారు చేశానని చెప్పాడు. అందులో ఎలాంటి కెమికల్స్ కలపలేదని తెలిపాడు. యూట్యూబ్‌లో చూపించిన విధంగానే వైన్ తయారు చేసి.. కొన్ని గంటల పాటు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఆ స్నేహితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని పోలీసులు తెలిపారు. వైన్ లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై కేసు కేసు నమోదు చేస్తామని తెలిపారు.