kerala bride playing the drums in full jose video goes viral
mictv telugu

వాయించి పారేసిన పెళ్లికూతురు.. వీడియో

December 27, 2022

kerala bride playing the drums in full jose video goes viral

పెళ్లి అంటేనే సందడి. బంధుమిత్రుల డ్యాన్సులు, బ్యాండు బాజాలతో హోరెత్తిపోవాల్సిందే. బరాత్ దుమ్మురేగిపోవాల్సిందే. కాలానికి తగ్గట్టు ట్రెండ్స్ కూడా మారిపోతున్నాయి. సిగ్గుల మొగ్గయ్యే పెళ్లికూతురు, చిర్నవ్వులు రువ్వే పెళ్లికొడుకు కూడా ధూంధాంలోకి వచ్చేశారు. కొందరు వధూవరులైతే డ్యాన్సులో మిగతావాళ్లను మించిపోయి చిందేస్తున్నారు. ఒక్క డ్యాన్స్ మాత్రమేనా బ్యాండు బాజా వాయించడంలో మాత్రం తక్కువా అంటూ ఓ పెళ్లికూతురు సీన్‌లోకి ఎంటరైంది. అది కూడా ఏదో సరదాకు వాయించినట్లు కాక పక్కా ప్రొఫెషనల్‌గా వాయించింది. చివర్లో ఆమె తండ్రికూడా వాద్యాన్ని మోగిస్తూ తోడు కావడంతో దృశ్యం మరింత రక్తికట్టింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళలోని ప్రఖ్యాత కృష్ణుడి ఆలయం గురువాయూర్ కోవెలతో జరిగిందీ డోలు బాజా. పెళ్లికూతురు తండ్రి చెండ అనే సంప్రదాయ వాద్య కళాకారుడు. ఆయన కూతురు కూడా ఆ కళలో ఆరితేరింది. పెళ్లిరోజున చెండ కళాకారులతో ఆమె వాద్యాన్ని లయబద్ధంగా వాయించింది. ఎక్కడా తడబడకుండా ఫుల్ జోష్‌తో మోగించింది. చివర్లో ఆమె తండ్రి కూడా అక్కడికి చేరుకున్నారు. తండ్రీకూతుళ్లు, తోటి కళాకారులు డమ్ డమ్ డమ్.. ఢమ్.. ఢమ్.. అని వాయిస్తుంటూ చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదంటున్నారు నెటిజన్లు.