ఇండియాలో ఇస్లాం రాజ్యమే మా టార్గెట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియాలో ఇస్లాం రాజ్యమే మా టార్గెట్

November 1, 2017

అడ్డంగా దొరికిపోయిన  కేరళ ఎన్జీవో చీఫ్
మతమార్పిడులు, లవ్ జీహీద్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళలోని పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఎన్జీవో చిక్కుల్లో పడింది. భారత దేశంలో ఇస్లామిక్ రాజ్య స్థాపనే తమ అంతిమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు సభ్యుడు అహ్మద్ షరీఫ్ చెప్పాడు. తమకు విదేశాల నుంచి అక్రమంగా నిధులు అందుతున్నాయని అంగీకరించాడు. ఇండియా టుడే టీవీ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఆయన ఇలాంటి విషయాలన్నీ చెప్పేసి అడ్డంగా దొరికిపోయాడు. పశ్చిమాసియా దేశాల నుంచి భారీగా నిధులను హవాలా మార్గంలో కేరళకు తీసుకొచ్చానని అతడు తెలిపాడు. పీఎఫ్ఐపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. పీఎఫ్ఐ మహిళా విభాగం చీఫ్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు జైనాబా కూడా స్టింగ్ ఆపరేషల్లో వివాదాస్పద అంశాలు బయటపెట్టింది. పీఎఫ్ఐ, సత్య సరణి అనే ఎన్జీవోలు కేరళలో భారీ స్థాయిలో మతమార్పిడులు చేస్తున్నట్లు ఆమె అంగీకరించింది. తమ సంస్థ ఇంతవరకు 5వేల మందిని ఇస్లాంలోకి మార్చిందని చెప్పింది. విద్యా, సేవా సంస్థల ముసుగులో మతమార్పిళ్లు సాగుతున్నట్లు పేర్కొంది. పీఎఫ్ఐకి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, ఇస్లాం దేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.