Kerala CM faces Youth Congress protest aboard aircraft
mictv telugu

విమానంలో ముఖ్యమంత్రికి సెగ.. నల్లచొక్కాలతో …

June 13, 2022

Kerala CM faces Youth Congress protest aboard aircraft

విమాన ప్రయాణంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. అదే విమానంలో ప్రయాణిస్తున్న యూత్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ కేరళలోని కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగింది.

వెంటనే అప్రమత్తమైన ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్.. వారిని వెనక్కి నెట్టేశారు. వారు నినాదాలు చేస్తుండగా జయరాజన్ వారిని తోసేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నిరసనలు చేపట్టిన వారు యూత్ కాంగ్రెస్ మట్టన్నుర్ బ్లాక్ అధ్యక్షుడు ఫర్సిన్ మజీద్, కన్నూర్ జిల్లా సెక్రెటరీ ఆర్కే నవీన్ కుమార్ అని తెలిసింది. వీరిని కన్నూర్ విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకోగా.. ట్రీట్‌మెంట్ కోసం తిరువనంతపురం వెళ్తున్నామని చెప్పి అనుమతి పొందినట్లు సమాచారం.