4 ఏళ్ల బాలికపై సీపీఎం నేత అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

4 ఏళ్ల బాలికపై సీపీఎం నేత అత్యాచారం

April 18, 2018

దేశం అత్యాచారాల అడ్డాగా మారిపోతోంది. పసికందు నుంచి ముసలమ్మల వరకు అందరూ కామాంధుల బారిన పడుతున్నారు. రాజకీయ పార్టీల నేతలే ఒళ్లు బలిసి, అధికార, ధనమదాలతో కాటేస్తుండడం కొత్త ట్రెండ్. బీజేపీ, కాంగ్రెస్.. ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలో రాక్షసమృగ సంతతి పెరిగిపోతోంది. విముక్తి, స్వేచ్ఛ, మహిళలకు సమానత్వం అని పొద్దస్తమానం వల్లించే సీపీఎం నేతలు కూడా చీకటి పాపాలకు ఒడిగడుతున్నారు. అభంశుభం ఎరుగని పిల్లలను చిదిమేస్తున్నారు కతువా, ఉన్నావో అత్యాచారాలను మరవకముందే కేరళలోమరో దుర్మార్గుడి పాపం వెలుగు చూసింది.కేరళలో సీపీఎం వార్డు మెంబరు ఒకడు నాలుగేళ్ల పసిబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దాన్ని ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగాడు. బాలిక చికిత్స కోసం రూ. 2 వేలు ఇస్తానని, కేసును వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నాడు. ఎర్నాకుళంలోని వెంగోళ పంచాయతీలో ఈ దారుణం జరిగింది. గత నెల 31న వార్డు మెంబరు తన బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డడాడని బాధితురాలి తల్లి తెలిపింది. తాము సీపీఎం నేతకు చెందిన షెడ్డుల్లో అద్దెకు ఉంటున్నామని, తాను లేని సమయం చూసి అతడు తన బిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డడాడని తెలిపింది.