కేరళలో ఘోరం.. విదేశీయువతిని చంపి, తల నరికి.. - MicTv.in - Telugu News
mictv telugu

కేరళలో ఘోరం.. విదేశీయువతిని చంపి, తల నరికి..

April 21, 2018

దేశంలో ఘోరాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. మహిళలు, బాలికలు ఒంటరిగా కనిపిస్తే చాలు దుర్మార్గులు బలితీసుకంటున్నారు. కేరళలో ఆయుర్వేద వైద్యం కోసం వచ్చిన ఒక విదేశీ మహిళను.. గుర్తుతెలియని దుండగుడు దారుణంగా చంపేశారు. ఆమె తలను నరికి పక్కన పడేశారు. తర్వాత మొండేన్ని ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. రాజధాని తిరువనంతపురానికి కూతవేటు దూరంలో ఈ ఘోరం జరగింది.

లాత్వియా దేశానికి చెందిన లిగా స్రోమనే(33) ఫిబ్రవరిలో భర్త, అక్కతో కలసి తిరువనంతపురానికి వచచింది. మార్చి 14న కోవలం బీచ్ కు వెళ్లింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయింది. భర్త, అక్క ఆమె కోసం విస్తృతంగా గాలించారు. శనివారం పోలీసులకు లిగా మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. వీరు ఆమె కుటుంబ సభ్యులకు తెలపగా.. లిగాదేనని గుర్తించారు. అయితే కచ్చితంగా నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. పరీక్షల తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.