చదువుల తల్లి.. ప్రపంచ రికార్డు కొట్టేసింది.  - MicTv.in - Telugu News
mictv telugu

చదువుల తల్లి.. ప్రపంచ రికార్డు కొట్టేసింది. 

October 2, 2020

Kerala Girl World Record in Online Class

లాక్‌డౌన్‌ సమయంలో స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. ఒక్క ఆన్‌లైన్ క్లాసులు మినహా ఏమి జరగడం లేదు. దీంతో చాలా మంది విద్యార్థులు చదువులకు దూరంగా ఉండి కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. కానీ ఓ యువతి మాత్రం పుస్తకాలతో కుస్తీ పట్టేసింది. ఆన్‌లైన్‌లో చదువును కొనసాగించింది. ఏకంగా  350 కోర్సులను కేవలం 90 రోజుల్లోనే పూర్తి చేసింది. అంతే కాదు ఇంత త్వరగా కోర్సులు పూర్తి చేసిన ఘనతను సాధించి వరల్డ్ రికార్డు కొట్టేసింది. కేరళకు చెందిన ఆరతి రేఘునాథ్ ఈ రికార్డు సృష్టించింది. దీంతో ఆమెను అంతా అభినందనలతో ముంచేస్తున్నారు. 

ఎలమక్కరకు చెందిన ఆరతి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీలు మూతపడటంతో ఎక్కువ ఖాళీ సమయం దొరికింది. దీంతో ఖాళీ ఉండకుండా ఏదైనా ఆన్‌లైన్ కోర్సు చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే వాటి వివరాలను సేకరించింది. 

జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ, డెన్మార్క్ టెక్నికల్ యూనివర్సిటీ,వర్జీనియా యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ సహ పలుప్రఖ్యాత యూనివర్సిటీలు ఆన్‌లైన్ క్లాసుల గురించి తెలిసింది. వెంటనే వాటిలో అడ్మిషన్ సంపాధించింది. ప్రతి రోజూ విధిగా క్లాసులు వింటూ దాదాపు 350 కోర్సులు పూర్తి చేసింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ కోర్సులు పూర్తి చేయడం, అది కూడా పెద్ద వర్సిటీల నుంచి కావడంతో ఆమెకు ప్రపంచ రికార్డుల్లో స్థానం లభించింది.